పహల్గామ్‌లో మహిళలు ఉగ్రవాదులతో పోరాడాల్సింది: బీజేపీ ఎంపీ

65చూసినవారు
పహల్గామ్‌లో మహిళలు ఉగ్రవాదులతో పోరాడాల్సింది: బీజేపీ ఎంపీ
పహల్గామ్ ఉగ్రదాడిపై మరో బీజేపీ ఎంపీ రామచంద్ర జంగ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాడి సమయంలో మహిళలు ఉగ్రవాదులతో పోరాడాల్సిందని చెప్పారు. కొంతమంది అయినా ప్రాణాలతో ఉండేవారన్నారు. 'మహిళలు అహిల్యాబాయి హోళ్కర్ చరిత్ర చదివి ఉంటే, ఎవరూ భర్తలను కోల్పోయేవారు కారు. భర్తలను కోల్పోయిన స్త్రీలకు యోధురాలి స్ఫూర్తి లేదు. ఉత్సాహం లేదు. ప్రేమ లేదు. అందుకే 26 మంది భర్తలు బుల్లెట్లకు బలైపోయారు' అంటూ వ్యాఖ్యానించారు.