సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో మహిళలు రోడ్డెక్కారు. పట్టణంలో రామస్వామి గట్టు వద్ద ఎన్నో సంవత్సరాలుగా నివాసముంటున్న నిరుపేదల స్థలాన్ని ప్రభుత్వం ఇటీవల కోర్టు నిర్మాణానికి కేటాయించింది. దీంతో ఆగ్రహించిన నిరుపేదలు హుజూర్ నగర్ ప్రధాన రహదారిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీలతో ధర్నాకు దిగారు. తాము ఎన్నో ఏళ్లుగా ఇక్కడ జీవిస్తుండగా ఇప్పుడు కోర్టుకు కేటాయించడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.