తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన 60 ఏళ్ల వ్యక్తిని బాధితురాళ్లు ఏకమై హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని అటవీప్రాంతానికి తీసుకువెళ్లి కాల్చేశారు. ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు గ్రామంలోని పలువురు మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ నెల 3న రాత్రి 52 ఏళ్ల వితంతువుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఆగడాలను తాళలేకపోయిన ఆరుగురు మహిళలు మరో నలుగురి సహాయంతో అతడిని చంపి, అడవిలో కాల్చేశారు. పోలీసుల విచారణలో దొరికిపోయారు.