పవన్‌ కళ్యాణ్ కుమారుడిని కాపాడిన కార్మికులకు సత్కారం

54చూసినవారు
పవన్‌ కళ్యాణ్ కుమారుడిని కాపాడిన కార్మికులకు సత్కారం
సింగపూర్‌లోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ CM పవన్‌ కల్యాణ్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయపడ్డ విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిన బాలుడు ప్రస్తుతం కోలుకున్నాడు. ప్రమాద సమయంలో నలుగురు భారతీయులు పవన్‌ కుమారుడిని కాపాడినట్లు తెలుస్తోంది. ఆ కార్మికులకు సింగపూర్‌ ప్రభుత్వం సత్కారం చేయనుంది. వారు 16 మంది చిన్నపిల్లలు, నలుగురు పెద్దవారిని రక్షించినట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్