వరంగల్ వేయి స్తంభాల గుడిలో ప్రపంచ సుందరీమణులు (వీడియో)

63చూసినవారు
TG: ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనే అందగత్తెలు బుధవారం చారిత్రక ఓరుగల్లు నగరంలో పర్యటించారు. ఈ క్రమంలో వరంగల్ వేయి స్తంభాల గుడిని ప్రపంచ సుందరీమణులు సందర్శించారు. నంది చెవిలో తమ కోరికను చెప్పిన సుందరీమణులు ఆ తరువాత శివయ్యకు అభిషేకం చేశారు. దర్శనానంతరం ప్రపంచ సుందరీమణులను వేద పండితులు ఆశీర్వదించారు. మిస్‌ వరల్డ్‌ పోటీదారుల పర్యటన నేపథ్యంలో సుమారు వెయ్యి మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్