తెలంగాణ CM రేవంత్ రెడ్డికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF) లేఖ రాసింది. దావోస్‌లో జరిగిన WEF సదస్సులో CM పాల్గొని.. రాష్ట్రానికి దాదాపు రూ. 1,80,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. దావోస్ సదస్సులో పాల్గొని క్రియాశీలక భాగస్వామ్యమైనందుకు WEF అధ్యక్షుడు బోర్జ్ బ్రెండె,బ్రెండే, మేనేజింగ్ డైరెక్టర్ మిరెక్ డూసెక్ కృతజ్ఞతలు తెలియజేస్తూ CMకి లేఖ రాశారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా బలోపేతం చేయాలన్న CM దార్శనికతను వారు ప్రశంసించారు.