ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా ఆసీస్ సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న WTC ఫైనల్లో ఓ చెత్త రికార్డు నమోదయ్యింది. ఇరు జట్లలోని ఓపెనర్లు ఖవాజా, ఐడెన్ మార్క్‌రమ్ డకౌట్ అయ్యారు. బ్రిటన్‌లో 1880 నుంచి ఇప్పటి వరకు (145 ఏళ్లలో) 561 టెస్టులు జరగగా ఇద్దరు ఓపెనర్లు సున్నాకే వెనుతిరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఓవరాల్‌గా ఇలా జరగడం పదోసారి.