చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం.. యువతిపై సామూహిక అత్యాచారం.. వృద్ధురాలిపై లైంగిక దాడి.. నిత్యం ఇలాంటి వార్తలు మనం చదువుతూనే ఉంటాం. అయ్యో!.. పాపం అనుకొని వదిలేస్తాం. అటువంటి ఘటన మన ఇంట్లో జరిగితే ‘ఈ సమాజం అంటే’ అని మౌనంగా వదిలేస్తామా?. నిందితుడ్ని పట్టుకొని దేహశుద్ధి చేస్తాం. పోలీసులకు అప్పగించి నిందితునికి శిక్ష పడే వరకూ నిద్రపోం. ప్రతి మహిళను ఆట వస్తువుగా చూడకుండా చెల్లిగా, తల్లిగా అనుకుంటే ఇటువంటి ఘటనలు జరగవు.