WPL 2025: గుజరాత్‌పై బెంగళూరు ఘన విజయం

56చూసినవారు
WPL 2025: గుజరాత్‌పై బెంగళూరు ఘన విజయం
వడోదర వేదికగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌(WPL)లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 201 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి తొలి గెలుపును నమోదు చేసింది. ఎల్లీస్ పెర్రీ (57), రిచా ఘోష్ (64*) అర్ధశతకాలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో యాష్లీ గార్డనర్ 2, డియాండ్రా, సయాలీ తలో వికెట్ పడగొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్