ఎన్నాళ్ల నిరీక్షణ.. ఎన్నేళ్ల నిర్వేదన.. ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ అంటే పరాజయం తప్ప టైటిల్ ఎరుగలేదు. దురదృష్టం తప్ప అదృష్టం ముఖం చూడలేదు. 'చోకర్స్' అనే పదాన్ని పటాపంచలు చేస్తూ సఫారీ సేన డబ్ల్యూటీసీ గదను ముద్దాడే రోజు వచ్చింది. బలమైన ఆసీస్‌ని మట్టికరిపించింది. మార్క్‌రమ్ సెంచరీ.. బావుమా విలువైన ఇన్నింగ్స్ జట్టును గెలుపు ముంగిట నిలిపింది. టెస్టుల్లో ఓడడం తెలియని కెప్టెన్ బావుమాకు మరో టెస్ట్ విజయం అజేయమైంది.