డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి దక్షిణాఫ్రికా చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. చోకర్స్ అనే ముద్ర చేరిపేసుకుని ఛాంపియన్స్‌గా మారింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ తమపై స్లెడ్జింగ్‌కు దిగినట్లు సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా ఆరోపించాడు. తమ జట్టు విజయానికి చేరువవుతున్నప్పుడు ఆసీస్ ప్లేయర్లు నోటికి పనిచెప్పినట్లు తెలిపాడు. తాను బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్ల నుంచి 'చోకర్స్' అనే పదాలు వినిపించాయని తెలిపాడు.