దాదాపు పది నెలల తర్వాత దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడికి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. బుధవారం లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఎంగిడి ఆడనున్నాడు. దక్షిణాఫ్రికా సెలక్టర్లు సీమర్ డేన్ పాటర్సన్‌ను కాదని లుంగి ఎంగిడికి చోటు కల్పించారు. అదనపు పేస్, బౌన్స్ రాబట్టగలిగే ప్రతిభే ఎంగిడికి ఈ అవకాశం దక్కేలా చేసింది.