ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) విజేతగా సౌతాఫ్రికా జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. చరిత్ర సృష్టించిన ఈ విజయంలో సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ ఐడెన్ మార్క్‌రమ్ (136) కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా బౌలర్లపై మార్క్‌రమ్ చెలరేగి ఆడారు. మార్క్‌రమ్ 207 బంతుల్లో 14 ఫోర్లతో 136 పరుగులు చేసి సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించారు.