సౌతాఫ్రికాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆరు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రదర్శనతో టెస్టుల్లో 300 వికెట్లు పూర్తిచేసుకున్న కమిన్స్ ఐసీసీ ఫైనల్స్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గానూ నిలిచాడు. దీంతోపాటు అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన బౌలర్‌గా ఘనత సాధించాడు. అంతేకాదు లార్డ్స్‌లో బెస్ట్ బౌలింగ్ చేసిన కెప్టెన్‌గానూ కమిన్స్ రికార్డు సాధించాడు.