ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) ఫైనల్ బుధవారం నుంచి లండన్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని నిపుణులు చెబుతున్నారు. ఐదు రోజుల పాటు ఆట సజావుగా సాగనుంది. ఒకవేళ వర్షంతో అంతరాయం కలిగినా రిజర్వ్ డే కూడా ఉంది. వాతావరణం వేడిగా ఉంటే మాత్రం స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. చల్లగా ఉంటే సీమర్లు రెచ్చిపోతారు. టాస్ కీలకం కానుంది.