WTC FINAL: సఫారీల విజయ దాహం తీరేనా?

53చూసినవారు
WTC FINAL: సఫారీల విజయ దాహం తీరేనా?
డబ్ల్యూటీసీ ఫైనల్‌‌లో సౌతాఫ్రికాకు ఆసీస్ నిర్దేశించిన లక్ష్యం 282 పరుగులు. లార్డ్స్‌లో బౌలింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై ఈ టార్గెట్ సఫారీలకు సవాలుగా మారనుంది. కాగా లార్డ్స్‌లో 250కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం టెస్ట్ చరిత్రలో కేవలం మూడుసార్లు మాత్రమే సాధ్యమైంది. ఆసీస్ బౌలర్ల తాకిడిని సౌతాఫ్రికా తట్టుకుంటుందా? ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే 27 ఏళ్లను సాకారం చేసుకుంటుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్