WTC FINALS: మూడు సీజన్లలోనూ ఇంగ్లండ్‌కే ఆతిథ్య హక్కులు!

50చూసినవారు
WTC FINALS: మూడు సీజన్లలోనూ ఇంగ్లండ్‌కే ఆతిథ్య హక్కులు!
విశేష ప్రేక్షకాదరణ ఉండే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వాలనుకున్న బీసీసీఐ ఆశలకు ఐసీసీ బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. 2027, 2029, 2031లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ల కోసం ఇంగ్లండ్‌కే ఆతిథ్య హక్కులు ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించిందట. ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. జులైలో జరగనున్న ఐసీసీ వార్షిక సదస్సులో దీన్ని అధికారికంగా ఆమోదించే అవకాశాలు ఉన్నాయని క్రీడా వర్గాలు వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్