ఆలేరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు సముద్రాల కుమార్ సతీమణి రాములమ్మ అనారోగ్యంతో హైదరాబాద్ ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చింది. గురువారం విషయం తెలిసిన ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.