ఆగి ఉన్న ట్రాక్టర్ ని బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలైన ఘటన ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం కురెళ్ల గ్రామానికి చెందిన కస్తూరి ముత్యాల కృష్ణ (50) రాయగిరి వెైపు నుండి తమ గ్రామానికి బైక్ పై వెళుతుండగా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని శ్రీ దుర్గ వైన్స్ ఎదురుగా ఆగి ఉన్న ట్రాక్టర్ నీ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తికి తల ముందు భాగంలో ధవడకు గాయాలయ్యాయి.