భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డును బలోపేతం చేసి సంక్షేమ పథకాలు కార్మికులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ డిమాండ్ చేశారు. సోమవారం ఆత్మకూర్ మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ముఖ్య నాయకుల సమావేశం కాలే మల్లేష్ అధ్యక్షతన జరిగింది.