యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణంలో మంగళవారం భూ భారత్ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి రెవెన్యూ ఎమ్మార్వో దేశ్య నాయక్ పాల్గొని రైతుల భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సలీం తదితర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.