ఆలేరు మండల రైతులు శనివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న 'ఉద్యాన్ ఉత్సవ్' కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే విధంగా వివిధ పంటలకు సంబంధించిన అంశాలు, మొక్కల పెంపకంపై ఏర్పాటు చేసిన 50 స్టాళ్లను చూసి స్టాళ్లలో గల వివిధ అధునాతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన పొందడమే కాకుండా, వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు.