రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

71చూసినవారు
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం
గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలైన 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొబైల్ మెడికేర్ యూనిట్ కార్యక్రమంలో భాగంగా శనివారం బిబినగర్ మండలం రావిపహాడ్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చల్ల జయశ్రీ, డాక్టర్ భవాని వైద్య బృందం రోగులకు వైద్యసేవలు అందించారు. మొత్తం 68 మందికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉచితంగా మందులను అందజేశారు.
Job Suitcase

Jobs near you