స్వర్ణగిరిని దర్శించుకున్న గూడూరు నారాయణరెడ్డి

60చూసినవారు
స్వర్ణగిరిని దర్శించుకున్న గూడూరు నారాయణరెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని శ్రీ స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణ రెడ్డి సందర్శించారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పర్యవేక్షకులు గూడూరు నారాయణరెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కొల్లోజు సతీష్ చారి, కసగోని సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్