భువనగిరి పరిధిలోని అనంతారం గ్రామం వద్ద శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని కుటుంబ సమేతంగా నాంపల్లి సివిల్ కోర్టు జడ్జి అరుణ కుమారి దర్శించుకున్నారు. అనంతరం రేణుక ఎల్లమ్మ తల్లికి బోనంతో తమ మొక్కు చెల్లించుకున్నారు. వారిని ఆలయ కమిటీ చైర్మన్ భువనగిరి మాజీ ఎంపీపీ తోటకూరి వెంకటేష్ యాదవ్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కల్లూరి మల్లేశం ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.