తుర్కపల్లి మండలంలోని బిల్యానాయక్ తండాలో శుక్రవారం హోలీ పండుగకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను తుర్కపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనావత్ శంకర్ నాయక్ గురువారం ఆహ్వానించారు. హోలీ పండుగను గిరిజన వాసులతో ఘనంగా జరుపుకోవాలని తమ ప్రియతమ నేత ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యని కోరారు. తమతోపాటు మదర్ డైరీ చైర్మన్, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పలువురు పాల్గొంటారని అన్నారు.