మోత్కూర్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం

58చూసినవారు
మోత్కూర్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం
యాదాద్రి జిల్లా గుండాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వేసవిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును మండల విద్యాధికారి మన్నె అగ్గి రాములు గురువారం ప్రారంభించారు. అనంతరం ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు గొడుగు బాలరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులలో మేధాశక్తి, ఏకాగ్రత నైపుణ్యాలను పెంపొందించడానికి సమ్మర్ క్యాంపులు ఎంతో దోహదపడతాయని అన్నారు.

సంబంధిత పోస్ట్