రాజపేట మండలం సింగారానికి చెందిన ఉపాధి కూలీ బొల్లారం నర్సమ్మ (55) గురువారం సాయంత్రం మృతి చెందారు. ఎప్పటిలాగే భర్త ఎల్లయ్య నరసమ్మలు ఉపాధి కూలీ పని చేసేందుకు వెళ్లి ఇంటికి వచ్చిన నర్సమ్మ మంచినీళ్లు తాగి కుప్పకూలిపోయింది. నరసమ్మను హుటాహుటిన రాజపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్ సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నరసమ్మ మృతి చెందింది.