భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ హైదరాబాద్ శివప్రసాద్ సుధారాణిల పర్యవేక్షణలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రావణమాస హరి రామ సంకీర్తన బుధవారం 27వ రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా పలు జిల్లాలకు చెందిన పలు భజన బృందాలు పాల్గొని సంకీర్తనలు చేసి తమ భక్తిని చాటుకుని, భక్తులను అలరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భజన మండలి సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.