యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో అంగన్వాడి ఆధ్వర్యంలో "అమ్మమాట అంగన్వాడి బాట" కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పుట్ట సునీత పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు 30 నెలల వయస్సు పూర్తయ్యాక, పూర్వ ప్రాథమిక విద్య కోసం అంగన్వాడిలో చేర్పించాలని సూచించారు. బిడ్డలకు ఆటపాటలతో పాటు విద్య ఇవ్వడం ద్వారా అన్ని రకాల అభివృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు.