తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లలో భక్తులు బారులు తీరారు. స్వామి వారి ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలియజేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైన ప్రత్యేక ఏర్పాటు చేశారు.