ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పరిరక్షణకై కార్మికులు ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ పిలుపునిచ్చారు. సోమవారం రావన్నపేట మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ముఖ్య నాయకుల సమావేశం పెండం నరసింహ అధ్యక్షతన జరిగింది.