

ఢిల్లీ ఫలితాలు.. కేజ్రీవాల్ పాత వీడియో వైరల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ప్రతిపక్ష బీజేపీ దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికార పీఠం దక్కించుకుంది. ఈ క్రమంలో 2023లో మాజీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియో వైరల్గా మారింది. బీజేపీ ఢిల్లీలో తమను ఎప్పటికీ ఓడించలేదని, మా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని, అది జరగాలంటే ప్రధాని మోదీ మళ్లీ పుట్టాలని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.