భువనగిరి పట్టణంలోని తారక రామా నగర్ 32వ వార్డ్ సభ్యులు హోలీ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా కాముని కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మేకల భాను, ఉడుత సిద్ధులు, సంపత్, గణేష్, ఉదయ్, కిరణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.