ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలు అర్పించిన భారత సైనికుల కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక, విద్య సహాయం, ఉపాధి అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయానికి భువనగిరి ఎన్ఎస్ యూఐ నాయకులు శనివారం ఉత్తరాల ద్వారా వినతి పత్రం అందించారు. ఎన్. ఎస్. యూ. ఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఉత్తరాలు రాసినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు సురపంగ చందు, ఎండీ మసూద్, జలీల్, నవీన్ పాల్గొన్నారు.