ఈ నెల 12న భూదాన్ పోచంపల్లిలో నిర్వహించే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటనను విజయవంతం చేయాలని భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బుధవారం అన్నారు. రాష్ట్ర చేనేత జౌళి శాఖ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, డిసిపి ఆకాంక్ష యాదవ్, జిల్లా హ్యాండ్లూమ్ ఏడి శ్రీనివాసరావు, ఇతర అధికారులతో కలిసి స్థానిక టూరిజం పార్క్‌తో పాటు చేనేత కార్మికుల గృహాలను కలెక్టర్ సందర్శించారు.