యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా సమన్వయ పర్యవేక్షణ కమిటీ( దిశ) సమావేశం ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈకార్యక్రమం లో భువనగిరి ఎమ్మెల్యేఅనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యేబిర్ల, కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎలా అమలు అవు తున్నాయి అనే అంశాలను దిశ కమిటీ చర్చించినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.