భువనగిరి: హాస్టల్‌లో బస చేసిన మున్సిపల్ కమిషనర్
కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు భువనగిరి పట్టణంలో ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల హాస్టల్‌లో మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి బుధవారం రాత్రి విద్యార్థులతో కలిసి బస చేశారు. విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులు సొంత భవనం కట్టించాలని బెడ్స్ ఇవ్వాలని విద్యార్థులు కమిషనర్ కోరారు.