యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామంలోని ప్రతిబోరును నీటి వనరులను సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకొని గ్రామాల్లో ప్రజలకు నిటిసమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామంలో ప్రతి ఇంట్లో జామ కరివేపాకు గులాబీ మునగ లాంటి మొక్కలను పెంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.