చిన్న సన్న కారు రైతుల నుండి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటపూర్ పిఎసిఎస్ లో ధాన్యం విక్రయిస్తున్న ముగ్గురు దళారులు పై క్రిమినల్ కేసు నమోదు తో పాటు ఏఈఓ సస్పెండ్, మరియు పిఎసిఎస్ సెంటర్ ఇంచార్జ్ ను విధులనుండి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తొలగించారు.