భువనగిరి పట్టణంలో గురువారం చైన్ స్నాచింగ్ జరిగింది. కిసాన్ నగర్లో నడుచుకుంటూ వెళ్తున్న ఆర్బి నగర్కు చెందిన ఓ మహిళ మెడలో నుండి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఐదు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాలనీలో సిసి ఫుటేజ్ లను పరిశీలించారు. సాయంకాల సమయంలో ప్రజల రద్దీలో చోరీ జరగడంతో పట్టణ ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు.