భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు లో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మోటకొండూరు మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభకు బీరకాయల మల్లేష్, చేరాల లింగయ్య, పబ్బల శ్రీరాములు అధ్యక్షా వర్గంగా వ్యవహరించారు.