భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో సభ్యులుగా నమోదైన వారి పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ పిలుపునిచ్చారు. సోమవారం మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని కేఆర్ భవన్ లో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ముఖ్య నాయకుల సమావేశం గుంటి రమేష్ అధ్యక్షతన జరిగింది.