భువనగిరి పట్టణంలోని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐ. ఎన్. టి. యు. సి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి శనివారం వినతిపత్రం అందించారు. పారిశుద్ధ కార్మికులు, ఎన్ ఎమ్ ఆర్ కార్మికుల సమస్యలపై మున్సిపల్ కమిషనర్ రామలింగంని కలిసి వివరించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు పడిగెల ప్రదీప్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.