యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు కొనసాగి మంగళవారం ఉదయం అష్టోత్తర శత ఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో ముగిశాయి. ఉదయం గర్భాలయంలో మూలవరులకు నిత్యారాధనలు అభిషేకాల అనంతరం అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. 108 కలశాల పూజలతో పాంచరాత్రాగమ శాస్త్రానుసారం అర్చకులు, యాజ్ఞికులు, పారాయణికుల బృందం అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు.