అతిగా మద్యం తాగిన వ్యక్తి వాంతులు చేసుకొని మృతి చెందిన ఘటన బుధవారం చింతపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మహేష్ చౌడి(36) ఓ పామాయిల్ తోటలో కూలీగా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన మహేష్ చౌడి రెండు రోజుల నుంచి ఎక్కువగా మద్యం సేవించి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు