ఈనెల 20న దేవరకొండ పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్ హాల్ లో జరిగే యువజన కాంగ్రెస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ అధ్యక్షుడు హరికృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు రాంసింగ్ నాయక్ లు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.