మిర్యాలగూడ పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు శుక్రవారం రాత్రి అన్నారం గ్రామానికి వెళ్లి తిరిగి వాళ్ళ గ్రామానికి ఆటోలో వెళ్తుండగా వెంకటాద్రిపాలెం గ్రామ శివారులో ఎదురుగ వచ్చిన ట్రాక్టర్ ఢీ కొని ఆటో బోల్తా పడడంతో ఆటోలో ఉన్న వెంకటేశ్వర్లు, నవీన్, సత్యవతి, రమ్యలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లుని పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు తెలిపారు.