ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియట్ సూర్యాపేట జిల్లా విద్యాధికారి భాను నాయక్ అన్నారు. శనివారం సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపర్డెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 22వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 8600 మంది పరీక్షలకు హాజరుకానునట్లు తెలిపారు.