కనగల్ మండలం బొమ్మపల్లికి చెందిన ఎంఎస్ఎఫ్ జాతీయ నాయకుడు కందుల మోహన్ తండ్రి కందుల రాములు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. శనివారం విషయం తెలుసుకున్న విహెచ్. పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు ఆయన భౌతిక కాయానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట చిలుముల జలంధర్, వీరబోయిన సైదులు, సందుపట్ల పరమేష్ ఉన్నారు.